01.
ఆ.వె.
గురువువిద్యనేర్పుగురుతరదీక్షతో
వారియందుభక్తివదలరాదు
గురువుబ్రహ్మవిష్ణుపరమేశ్వరుండౌను
గురువుజాతికెపుడుపరువుసుమ్మి!!!
02.
ఆ.వె.
మట్టిముద్దవానిమాణిక్యముగమార్చి
పట్టుదలగవిద్యపరగసలిపి
జగతిలోనకీర్తిసతతంబుకలిగించు
గురువరేణ్యులెపుడుగొప్పవారు!!!
03.
ఆ.వె.
"తల్లిదండ్రిగురువుదయగలదేవుళ్లు"
"వారినెపుడుగొల్వువాంఛదీర"
"కంటిరెప్పలాగకాచిరక్షించుచు"
"మార్గదర్శకులయిమంచిపంచు"!!!
04.
తే.గీ.
పాఠములతోడజీవితపాఠములను
బోధనముజేసిశిష్యులప్రోత్సహించి
భావితరముకుబంగారుబాటవేసి
నవసమాజమునిర్మించుప్రవిమలముగ!!!
05.
కం.
గురువేమిత్రుడు,బంధువు
గురువే,మనతోడునీడ,కువలయమందున్
గురువునుమించినదైవము
ధరణినివెదుకంగలేదుధైర్యముమనకున్!!!
06.
కం.
దండమయాగురుబ్రహ్మా
దండమయావిష్ణుమూర్తిదండముజేతున్
దండమయాగురుశివుడా
దండమయాగురుసమముకుదండములిడుదున్!!!
07.
కం.
కరుణనుకురిపించిభువిని
సరియగుజ్ఞానంబునింపి,ఛాత్రులమదిలో
నిరతముకొలువుండుదువే
గురువరనాకెపుడుమీరెగొప్పనిదలుతున్!!!
08.
కం.
అజ్ఞానముదొలగించియు
విజ్ఞానమునందజేసి,విలువలునేర్పున్
సుజ్ఞానముశ్రేష్ఠంబని
ప్రజ్ఞాశాలిగమనలనుపట్టుకమార్చున్!!!
09.
కం.
"గురుశిష్యులబంధమ్మిది"
"చరితనుసృష్టింపజేసెసత్యమ్మిదియే"
"తరగనివిద్యానిధులా"
"భరణమ్ములనందజేయుప్రతిక్షణమందున్"!!!
10.
కం.
చదువులపరమార్థంబును
వదలకశిష్యులకుజెప్పుబాధ్యతతోడన్
ముదముగసంభాషించియు
విధులనునెరవేర్చుచుండివిజ్ఞతజూపున్!!!
11.
కం.
"రాధాకృష్ణన్! భారత"
"మేధావియె,తత్త్వవేత్త,మేటిగనిల్చెన్" "వాదనలోవిజ్ఞానిగ"
"బోధనలోపండితుండు,పూజ్యుండెపుడున్"!!!
12.
సీ.
అజ్ఞానతిమిరాలనంతంబుగావించి
విజ్ఞానమందించువేత్తగురువు
ఆత్మవిశ్వాసమ్మునాత్మస్థైర్యమ్మును
సంకల్పబలమిచ్చుసతముగురువు
క్రమశిక్షణనునేర్పికర్తవ్యదీక్షతో
విలువలుబోధించివెలుగుగురువు
సంస్కారయుతముగాచదువులసారము
ఛాత్రులకొసగెడిజయముగురువు
(తే.గీ.)
సత్యపథమునపయనించుసద్గుణుండు
కల్మషములేనినిస్వార్థఘనబుధుండు
సత్ప్రవర్తన,త్యాగము,సహనగుణము
అతనివెన్నంటియుండెడియాస్తిపాస్తి!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి