గురుశిష్యుల బంధం:--మచ్చ అనురాధ.తెలుగు భాషోపాధ్యాయురాలుసిద్దిపేట

గురువు అజ్ఞానాంధకారం తొలగించే వెన్నెల అయితే....
శిష్యులు  చకోర  పక్షులు అవుతారు.

గురువు అక్షరాల చదరంగం అయితే ......
శిష్యులు ఆనంద దృశ్యకులు అవుతారు.

గురువు సంస్కార మార్గదర్శకుడు అయితే....
శిష్యులు సద్గుణ సంపన్నులు అవుతారు.

గురువు విద్యాబోధనలో క్రొవ్వత్తి  అయితే......
శిష్యులు సమాజానికి  ధ్రువ తారల అవుతారు.

గురువు  ప్రేమ ఆప్యాయతలకు నెలవైతే....
శిష్యులు  విశ్వ  ప్రేమికులు అవుతారు.

గురువే  తరగతిగది అయితే....
శిష్యులు  తరగని నిధులు అవుతారు.

గురువు నిత్య శోధకుడు అయితే.....
శిష్యులు  సత్య  పాలకులు అవుతారు.

గురు విజ్ఞాన సంపదకు పాదు అయితే....
శిష్యులు వెలుగులు పంచే దీప్తులు  అవుతారు.

గురువు విద్యార్థుల తలరాతను మార్చే బ్రహ్మ అయితే....
శిష్యులు  దేశోద్ధారకులు అవుతారు.


కామెంట్‌లు