*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 56.ప్రేమ!
     అమృత భాండం!
     అభాండాలు అంటవు!
     అనంత ఇక్షుఖండం!
   ఖండఖండాలైనా మధురమే!
57.ప్రేమ!
      నిత్యసత్యం!
      స్వాతిముత్యం!
      తెలుగుపద్యం!
      ప్రియనైవేద్యం!
58.ప్రేమ!
      విద్యల భారతి!
       వెన్నెల హారతి!
       కన్నుల కాంతి!
       మనసున శాంతి!
59.ప్రేమ!
      ఆవుదూడ!
      కుక్కపిల్ల!
      లేడికూన!
      ఏదైనా ప్రేమకర్హమే!
60.ప్రేమ!
      జీవితం అరసం!
      ప్రేమతో సరసం!
      ప్రేమ ప్రభాస్!
     జీవితం సెబాస్!
       ( కొనసాగింపు)

కామెంట్‌లు
రామానుజం.ప. చెప్పారు…
ప్రేమ....సరస మైన భావనలు 👌 అమృత తుల్య భాష(ల)కు ప్రణామాలు🙏