గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (39);-ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం 9492811322.

 ఒకరోజు రెడ్డి గారి ఆఫీసులో నెలవారీ కార్యక్రమాల్లో  దశావతారాలను గురించిన గోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా మాట్లాడవచ్చు అధ్యక్షునిగా ఒక్కరే వేదిక పైన ఉంటారు.  మాట్లాడవలసిన వారు వచ్చి వారి విషయాలను మాట్లాడిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి కూర్చోవాలి. అలా కాకుండా కొందరినే పైన కూర్చో పెట్టినప్పుడు వీరేనా పెద్దవారు  మాట్లాడేవారు అన్న విమర్శలు చేయడానికి కొంత మందికి అవకాశం ఉంది. అలాంటి మాటలకు ఆస్కారం లేకుండా ఏర్పాటు చేశారు శివనాగిరెడ్డి గారు. అలా ప్రతి విషయాన్నీ ప్రణాళికాబద్ధంగా చేయడం  వారికి అలవాటు. ఆ రోజు  హాలు మొత్తం నిండి కొంతమంది నిలబడ్డారు కూడా. మొత్తం అందరూ వారి వారి అభిప్రాయాలను వెలువరించిన తరువాత ఈ విషయాలను గురించి కార్యక్రమాన్ని సమీక్షించడం కోసం ఆనంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు రెడ్డి గారు. నేను వేదిక పైకి వెళ్ళి నమస్కరించి ఈరోజు విషయం దశావతారాలు ఈ శబ్దానికి అర్థం భగవంతుడు ఏ ఏ అవతారాలతో  ఈ భూమి మీద అవతరించాడో ఆ విషయాలను  చాలా చక్కగా వక్తలు వ్యక్తీకరించారు ముందు వారికి ధన్యవాదాలు చెబుతున్నాను. రెడ్డి గారు ఏవైనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అంటే దానిలో విషయం ఉంటుంది. అంతర్లీనంగా ఉన్న విషయాలను కూడా  మేధావులు బయటకు తీసుకు వస్తారన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు రెడ్డి గారు. వారి మనసులో విషయాన్ని నేను అనుకోవడం భగవంతుని అవతారాలు అయితే ఈ చర్చ ఉండదు. ఉన్నది తొమ్మది అవతారాలే కదా కలికి అవతారం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎవరికి తెలుస్తోంది  దశ అంటే పది అన్న అర్థంతో పాటు స్థితి అనే మరో అర్థం కూడా ఉంది మన వారు దానిని విస్మరించారు  ఒక వివాహితగర్భాన్ని ధరించిన మొదటి రోజు నుంచి  తొమ్మిది నెలల వరకు బిడ్డ ప్రగతిని గురించి చెప్పే విషయం అని నేను అనుకుంటున్నాను.
గర్భస్థ శిశువు మొదటి నెల చేప ఆకారంలో ఉంటుంది ఇది నీటిలో ఉన్న ప్రాణవాయువును స్వీకరించి జీవిస్తుంది తర్వాత స్థితి  తాబేలు ఆకారం ఇది నీటిలో ఉన్న ప్రాణవాయువును ఎలా స్వీకరించగలదో గాలిలో ఉన్న ప్రాణవాయువును కూడా అలాగే స్వీకరించి జీవిస్తోంది. తరువాత వరాహం పంది ఇది నీటిలోనూ జీవించగలదు  భూమిపైనా జీవించగలదు  అయితే నీటి నుంచి బయటకు వచ్చిన కొత్తలో బురదలో ఉండడానికి ఇష్ట పడుతుంది అన్నది ఊహ. తరువాత విషయం జంతు స్థితి నుంచి  మానవ స్థితికి వచ్చే పద్ధతికి ప్రతీక నరసింహస్వామి ఈ అవతారంలో జంతు ప్రకృతి ఉంటుంది మానవ ప్రకృతి ఉంటుంది దీనిని దాటి వచ్చే అవతారం వామన అవతారం పొట్టిది దీని తరువాత పరశురాముడు వీరు రాతి యుగానికి చెందిన వారు  కనుక వారి ఆయుధం గండ్రగొడ్డలి. తనకు కావలసిన వస్తువులు  ఖండించి తెచ్చుకోవడం  జంతువులను చంపి మాంసాహారం తినడం  శత్రువులు అన్న వారిని  దండించడానికి ఈ గండ్రగొడ్డలి.
సశేషం...

కామెంట్‌లు