పంచపది ,;- భరతమాత యశోతేజం!;- డా.పివిఎల్ సుబ్బారావు, 94410 58797.
నా పంచ పదుల సంఖ్య---

993.
ఆ, అవుల్ ఫకీర్ జలాలుద్దీన్, అబ్దుల్ కలామ్!

భరతమాత ప్రియపుత్రుడు,, మనః పూర్వక ప్రణామ్!

మన పదకొండవ రాష్ట్రపతిగా, సువిఖ్యాత నామ్!

ప్రొఫెసర్, రచయిత, శాస్త్రవేత్త, వారు యశోధామ్!

భారతదేశ మిస్సైల్ మేన్,
 క్షిపణి రంగం సలామ్, పివిఎల్!

994.
జన్మ పేదరికం ,స్వయంకృషి, విద్యారంగ శ్రీమంతుడు !

పనే ప్రాధాన్యత ,
నిలిచే దేశాన ప్రధమ పౌరుడు! 

డి. ఆర్. డి. ఏ., ఇస్రో సంస్థల, వికాసాన సూత్రధారుడు!

 అతి సాదా జీవితం ,
సమున్నత ఆలోచనపరుడు!

 ఆసక్తి, "సాధన, బోధన",
 చివరి శ్వాస బోధకుడు,  
 పివిఎల్!

995.
ఇండియా అభివృద్ధి కోసం, ప్రణాళికలెన్నో ఇచ్చాడు!

"కన్న అమ్మ ,సంగీతం అమ్మ, సేవ అమ్మ" , ముద్దుబిడ్డడు! 

ఖురాన్ ,గీత,తిరుక్కురళ్,   
   అధ్యయనం కావించాడు! 

శాకాహారి, బ్రహ్మచారి, 
 నిత్య క్రమశిక్షణాపరుడు! 

సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన, నమూనాగా నిలిచాడు, పివిఎల్!

996.
బహు డాక్టరేట్లు, సత్కారాలు, పతకాలు, గ్రహించాడు!

దేశ అత్యున్నత గౌరవం, భారతరత్న భాసించాడు! 

"ఇండియా మై డ్రీమ్",
  " ఇగ్నైటెడ్ మైండ్స్",
        తాను రచించాడు !

పునః పదవి కోరనివాడు ,
  ఆ  ఆకాంక్ష లేనివాడు!

రామేశ్వరాన కలాం స్మృతి, సందర్శనం మన భాగ్యము,
పివిఎల్ !
________


కామెంట్‌లు