ఇంటర్మీడియట్లో ఎస్ ఎల్ బి వికారాబాద్ విజయ దుందుభి; వెంకట్ మొలక ప్రతినిధి
 టాపర్లుగా... 
- ఫస్ట్ ఇయర్ లో సిహెచ్. హేమవతి( ఎంపీసీ), 
- సెకండ్ ఇయర్ లో వై. అక్షయ (ఎంపీసీ), బి.జాహ్నవి( బైపిసి), 
- ఫస్ట్ ఇయర్లో 96.4% ఉత్తీర్ణత 
- సెకండ్ ఇయర్ లో 98.7% ఉత్తీర్ణత
వికారాబాద్: జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి సంగం లక్ష్మీబాయి గురుకుల కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకుల కృషి ఫలించి విద్యార్థుల విజయదుందుభి మోగింది. బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సంగం లక్ష్మీబాయి గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు మంచి ఫలితాలు సాధించారు.  అధ్యాపకుల బోధనా ప్రయత్నం, విద్యార్థినిల పట్టుదల చదువులు ఫలించాయి.  దీంతో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం వచ్చింది.  
మొదటి సంవత్సరంలో ఉన్న 85 మంది విద్యార్థులకు 82 మంది విద్యార్థులు పాసై 96.4% ఉత్తీర్ణత నమోదయింది.  అలాగే ద్వితీయ సంవత్సరంలో మొత్తం 79 మంది విద్యార్థులకు గాను 78 మంది పాసై 98.7% ఉత్తీర్ణత సాధించారు. 
మంచి మార్కుల్లో వీరు. .. 
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను సిహెచ్ హేమవతి 466 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. సిహెచ్ భార్గవి 465 వి మయూరి 465 సిహెచ్ స్వర్ణ 464 మార్కులు సాధించారు.  బైపిసి గ్రూపులో 440 మార్కులకు గాను సంధ్యారాణి 436 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది.  ఎం. కావేరి 435 సి.స్పందన 434 ఎం. కృష్ణవేణి 434 మార్కులు సాధించారు. 
అలాగే ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు వై. అక్షయ  988 మార్కులు సాధించి ఈ ఏడాది టాపర్గా నిలిచింది . బి.దీక్షిత 982, సిహెచ్.యస్మిత 981 మార్కులు సాధించారు. 
సెకండ్ ఇయర్ బైపిసి లో 1000 మార్కులకు గాను 982 మార్కులు సాధించి బి. జాహ్నవి ఈ ఏడాది టాపర్గా నిలిచింది.  వి.అశ్విత 982, ఎన్.రాధ 980, బి.భార్గవి 979 మార్కులు సాధించారు.  
ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ విద్యార్థులను అభినందించారు. మంచి ఫలితాలు సాధించడానికి నిరంతర మంచి బోధన అందించిన అధ్యాపకులకు అలాగే విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్య విద్యార్థి బంగారు భవిష్యత్తుకు మైలురాయి వంటిదని విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రిన్సిపల్ డాక్టర్ గోపీశెట్టి రమణమ్మ ఆకాంక్షించారు
---------;;;;;;----------

కామెంట్‌లు