ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
*భాస్కర శతకము* - పద్యం (౧౮-18)
September 23, 2020 • T. VEDANTA SURY • Poem

ఉత్పలమాల :
*ఊరక సజ్జనుండొదిగి | యుండిన నైన దురాత్మకుండు ని*
*ష్కారణ మోర్వలేక యప | కారము చేయుట వాని విద్యగా;*
*చీరెలు నూరు టంకములు | చేసెడి వైనను బెట్టె నుండఁగాఁ*
*జేరి చినింగిపోఁ గొరకు | చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
వేలకు వేలు విలువ చేసే చీరలు వాడకుండా, మడతలు పెట్టి,  పెట్టెలో వుంచి నపుడు, తనకు ఎటువంటి లాభమూ లేకపోయినా, చిమ్మెట పురుగు ఆ చీరలను చిరుగుల గుట్టగా చేస్తుంది. అలగే, చెడు ప్రవర్తన కలవాడు, దుర్మార్గుడు అయినవాడు, తన జోలికి రాకుండా, తమ పని తాము చూచుకుంటున్న మంచి వాళ్ళకు, ఏకారణమూ లేకుండానే వారిని బాధ పెట్టే పనులు చేస్తూ వుంటాడు.  ...... అని భాస్కర శతకకారుని వాక్కు.
*సుగ్రీవుని కి చేటు చేసిన వాలి లాగా* అనమాట.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss