ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అంతా యంత్రమయం.: --కళావతి కందగట్ల హైదరాబాద్9948263004
November 5, 2020 • T. VEDANTA SURY • Poem

అవును... 
మారుతున్న కాలంలో 
మనిషి... మరయంత్రం లా 
మసులుకుంటున్నాడు 

సహజత్వపు  
పోకడలను మరిచి.. 
పరస్పర బంధాలను 
కాదంటూ... 
యంత్ర పరికరాల 
మాయలో పడి 
కొట్టుకు పోతున్న మనిషి 

మీటనొక్కితే 
పనిచేయు పరికరాలతో   
బద్దకానికి నిలువుటద్దంగా 
మిగిలిపోతూ.... 
లెక్కకు మించి జబ్బులను 
కొనితెచ్చుకుంటున్న మనిషి...

సుఖ జీవితానికి 
ఆధునిక పరికరాల విజ్ఞానం
అవసరమే కానీ... 
శ్రమైక జీవన విధానాన్ని 
మరిస్తే.... 
అనారోగ్యానికి హేతువు సుమా !