ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అందం - ఆపద:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 18, 2020 • T. VEDANTA SURY • Poem

మా పెరటి గులాబి మొక్క
మారాకు వేసిందండీ
కొమ్మలు రెమ్మలు అందంగా
ఎదిగాయి చూడండీ
పువ్వుల్లో రాణీపువ్వు
గులాబి పువ్వేనండీ
అందమైన ఆపువ్వూ
ముళ్ళమధ్య ఉందండీ
అందమెప్పుడూ ఆపదతో
కూడిఉండును చూడండీ !!