ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అక్షరాల అంచున ...: -కె .ఎల్వీ -హనంకొండ. : ఫొటో ---ఆన్షి.నల్లి
October 29, 2020 • T. VEDANTA SURY • Poem

అ ...అంటే 
అమ్మ అంటాను 
అమ్మతో అనురాగం 
అమృతంలా 
ఉందంటాను ...!

ఆ ..అంటే ,
ఆవు ..అంటాను ,
ఆవు ఉన్న ఇల్లు 
ఆ రోగ్య నిలయ-
 మంటాను ... !   

ఇ..అంటే,
ఇల్లు అంటాను ,
ప్రతి మనిషికి ...
ఒక  గూడు --
అవసరం అంటాను .!

ఈ ..అంటే ,
ఈత అంటాను ,
బ్రతుకు సముద్రం 
ఈదడం తెలివికి 
సంకేతం అంటాను ...!

ప్రతి అక్షరంలోనూ 
జీవన సంకేతం 
చూస్తాను .....

అక్షరాల అల్లికతో 
బతుకు పుస్తకం 
రాస్తాను ......!

అక్షరాలలోని విలువను 
విశ్వవ్యాప్తం చేస్తాను ..!!