ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అక్షర గీతం--పోలయ్య కవి కూకట్లపల్లి హైదరాబాద్ - 9110784502
September 7, 2020 • T. VEDANTA SURY • Poem

పల్లవి:
తెలుసుకోండిరో 
బాబు తెలుసుకోండిరా 
తెలుసుకుంటె 
మీ బ్రతుకున తేనె నిండురా 
జగతికి నవజీవమని 
ప్రగతికి ప్రతిరూపమని 
చీకటిలో దీపమని 
చదువంటే దైవమని 
చదువే సర్వస్వమని ||తెలుసుకోండి||

*చరణం: 1*
కండ బలమున్ననేమి ?
గుండె బలమున్ననేమి? 
అందచందములున్ననేమి ?
ఆస్తిపాస్తులున్ననేమి ?
"అక్షరజ్ఞానంలేని నాడు" - వాడు 
"అమావాస్య చంద్రుడని"  
||తెలుసుకోండి||

*చరణం: 2*
విద్య ఎందుకంటారు 
వెర్రిప్రశ్నలేస్తారు వేలిముద్రలేస్తె 
మిమ్ము వెర్రి వాళ్ళంటారు 
బడికి పొండిరో బాబు
బడికి పొండిరా బడికిపోతే 
మీ బ్రతుకున బంగారు పండురా ||తెలుసుకోండి||

*చరణం: 3*
చదువెందుకంటారు 
చచ్చుప్రశ్నలేస్తారు 
సంతకాలు రాని మిమ్ము 
సన్యాసులె అంటారు 
చదువుకోండిరో బాబు
చదువుకోండిరా 
చదువుకుంటే 
మీ బ్రతుకులు చల్లగుండురా ||తెలుసుకోండి||

*చరణం: 4*
"పలకాబలపం" పట్టి 
పాఠశాలకెళ్లాలని 
"అఆలు" మొదలుపెట్టి 
"అక్షరాలు" దిద్దాలని 
"పుస్తకాలు" తెరవాలని
"పాఠాలు" చదవాలని 
"అక్షరజ్యోతిని" పట్టి మీరు 
అడుగు ముందుకెయ్యాలని 
తెలుసుకోండిరో బాబు
తెలుసుకోండిరా 
తెలుసుకుంటే 
మీ బ్రతుకున తేనెనిండురా||తెలుసుకోండి||