ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అక్షర వాచస్పతి డా.దాశరథి రంగాచార్య గారు పిల్లల కోసం సరళమైన భాషలో పసిహృదయాలల్లో భగవంతుడు పట్ల భక్తి ని పెంపొందించేలా ' శ్రీ వెంకటేశ్వర లీలలు ' అనే పుస్తకం రాసారన్న విషయం నాకు ఈ పుస్తకం సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్ లో చూసి ఆశ్చర్య పడి పుస్తకం సొంతం చేసుకునే వరకు తెలియలేదు.ఈ పుస్తకానికి శ్రీ బాపు గారు పిల్లల్లో కొంటె తనాన్ని భగవంతుడితో ఆటలు పసి హృదయాన్ని తెలియజేసేలా చక్కటి బొమ్మ వేశారు.పుస్తకం లోపల కథకి తగట్టుగా మరో చిత్రకారుడు బొమ్మలు వేసి ఉన్నాడు.ఏదిఏమైనా దాశరథి గారు వంటి మహావృక్షము పిల్లల కోసం అనేక పుస్తకాలు రాయడం పిల్లల అదృష్టం గా భావించాల్సిన విషయం యిది !
June 24, 2020 • T. VEDANTA SURY • Book Review