ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అక్షర సేద్యం ఫౌండేషన్ రామునిపట్ల -సిద్దిపేట జిల్లా
October 15, 2020 • T. VEDANTA SURY • News

5వ వార్షికోత్సవ నివేదిక

ఆత్మీయులకు విజయదశమి శుభాకాంక్షలు !

“ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక” అన్నారు మహాకవి కాళోజీ. సమాజాన్ని చైతన్య పరిచే మహాత్తర శక్తి అక్షరం. ప్రతి ఒక్కరు అక్ధరాస్యులైనప్పుడే ఈ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందింప చేయడానికి పరీక్షలు నిర్వహించి,తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే సదుద్దేశంతో 2015 సంవత్సరం విజయదశమి రోజున స్థాపించబడింది  “అక్షర సేద్యం   పౌండేషన్ “.

    ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడం వలన ఎంతోమంది ప్రేరణ పొంది ,వారు కూడ ప్రతిభావంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.   ఇచ్చేది చాలా చిన్న బహుమతులు.ఇవి విద్యార్థులకు ఎక్కువగా ప్రోత్సాహన్ని ఇవ్వగలవు అని ఆశిస్తున్నాము.పుస్తకాలు  జ్ఞాన జ్యోతులు .విద్యార్థుల దృష్టి పుస్తకాల వైపు ఆకర్షించడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ పౌండేషన్ ప్రధాన ఆశయం.

 

@ ఇప్పటి వరకు చేసిన. కార్యక్రమాలు :

 1.డిసెంబర్ 2015 లో రామునిపట్ల ZPHS  విద్యార్థుల కు పద్యపఠన పోటీల నిర్వహణ. బహుమతుల ప్రధానం 

2. జనవరి 2016 లో పెద్దకోడూర్ ZPHS విద్యార్థుల కు పద్యపఠన పోటీల నిర్వహణ. బహుమతుల ప్రధానం. 

3.జక్కాపూర్ ZPHS విద్యార్థుల కు 2016 వసంత పంచమి రోజున నీతి కథల పుస్తకాలు పంపిణీ 

4.సిద్దిపేట గ్రంథాలయానికి ₹2000 విలువ గల groups -exam study material బహుకరణ.

5.2016, చిన్నకోడూర్ మండలస్థాయి పదవ తరగతి ప్రతిభా పరీక్ష లో హిందీ లో మొదటి శ్రేణి విద్యార్థి కి బహుమతి ప్రధానం.

6.Dsc కి ప్రిపేరయ్యే ఇద్దరికి study material బహుకరణ

7.SSC-2016 ZPHS జక్కాపూర్  హిందీ  విషయం లో   10/10 points సాధించిన విద్యార్థి కి ₹ 500 నగదు బహుమతి ప్రధానం. 

8.  సిద్దిపేట  గ్రంథాలయం లో 30 మంది విద్యార్థుల కు సభ్యత్వ కార్డుల  పంపిణి.(ఈ కార్యక్రమం 2007-08 రాజగోపాల్ పేట SSC  బ్యాచ్ కు చెందిన మా విద్యార్థులు వి.రాజు ,జి.అశోక్ లు నిర్వహణ)

9..డిసెంబర్ 2016లో సిద్దిపేట మాథ్స్ ఫోరం గణిత శాస్త్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ప్రతిభా పరీక్ష లో జిల్లా స్థాయి ప్రథమ ,ద్వితీయ స్థానం పొందిన సింధూజ, హారిక  (ZPHS.ఎల్లారెడ్డిపేటవిద్యార్థులు)లకు బహుమతి ప్రదానం.వీరు రాష్ట్ర స్థాయిలో కూడ ప్రథమలుగా నిలిచారు.

10.2017  ఉగాది పండుగను పురస్కరించుకుని జక్కాపూర్ ఉన్నత పాఠశాలలో బాల కవి సమ్మేళనం నిర్వహణ.

11.జక్కాపూర్ ఉన్నత పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరం  అత్యుత్తమ హాజరు శాతం కలిగిన పది మంది  విద్యార్థులకు బహుమతి ప్రదానం.

12.2017 ఆగస్టులో మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా రామునిపట్ల గ్రామ సేవకులకు సత్కారం .

13.డిసెంబర్ 2017లో హైదరాబాద్ లో నిర్వహించిన  ప్రపంచతెలుగు మహాసభల లో ఆవిష్కరించిన” అలుకు మొలకలు “ కవితా సంపుటి   పుస్తకాన్ని  ప్రచురణ.100 కి పైగా పాఠశాల లకు పంపిణీ

14.మిషన్ ఎథికల్ ఇండియా ఆధ్వర్యంలో 2018 ఆగస్టు లో జక్కాపూర్ పాఠశాల లో నిర్వహించిన “నీతి కథలు చెప్పడం” పోటీ విజేతలకు బహుమతి. ప్రదానం.

15. 11 సంవత్సరాల క్రితం ZPHS.రాజగోపాల్ పేట లో   విద్యార్థులు నిర్వహించిన “అక్షర”పక్ష పత్రిక సంచికలను e-book గా రూపకల్పన.

16. విద్యార్థులలో రచనా వ్యాసంగం పెంపొందించడానికి బాల సాహిత్యమునకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు మరియు సేకరణ  చేసి ,అందించి ప్రోత్సహించడం.

17.  తేది.06.07.2019 రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజగోపాల్ పేట లో "అక్షర పక్ష పత్రిక మాల " పుస్తకం ను ఆవిష్కరించడం.50 ప్రతులు పంపిణీ.

18.  తేదీ.15.08.2019 న ZPHS రాజగోపాల్ పేట SSC - 2019 పరీక్షలలో 9.7 GPA సాధించిన ముగ్గురు విద్యార్థులకు 5000 రూపాయల నగదు,ప్రశంస పత్రాలు బహుకరణ.(ఈ కార్యక్రమాన్ని ZPHS రాజగోపాల్ పేట 2007-08 SSC బ్యాచ్ విద్యార్థులే నిర్వహించారు.)

19. తేదీ .14.11.2000 బాలల దినోత్సవ సందర్భంగా బాలల కోసం రామునిపట్ల లో "బాలల గ్రంధాలయమ " ఏర్పాటు చేయడం జరిగినది.


20..బాల సాహిత్య వికాసం కొరకు,విద్యార్థుల రచనలను ప్రోత్సహించాలనే  ఆశయం తో "అక్షర సేద్యం" బాలల సాహిత్య త్రైమాసిక పత్రిక ను( జనవరి -మార్చ్ '1000 ప్రతులు ) 2000 ఫిబ్రవరి 1వ తేదీన ఆవిష్కరించడం జరిగింది.

21.కోవిడ్ -19 నేపథ్యంలో వలస కార్మికులకు ,సఫాయి కార్మికుల కు చేయూత నివ్వడం (2 వేల రూపాయలు విలువ గల వస్తువులు ) జరిగింది.
       
          ఈ పౌండేషన్ నిర్వహించిన కార్యక్రమాలకు సహకరిస్తున్న మిత్రులు, విద్యార్థులు శ్రేయోభిలాషులు,పాఠశాలల ఉపాధ్యాయ బృందాలు , కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ,అందరికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ 5 సంవత్సరాలు నిర్వహించిన కార్యక్రమాలలో రాజగోపాల్ పేట  పాఠశాల పూర్వ విద్యార్థులు  పోషించిన క్రియా శీల పాత్రను చూసి గర్వపడుతున్నాము.

మీ అందరి సహాయ,సహాకారాలను సదా ఆకాంక్షిస్తూ,
కృతజ్ఞతలతో ………     

/- 
భైతి దుర్గయ్య 
      (అధ్యక్షులు -99590 07914)
   
 వేల్పుల రాజు
  (ప్రధాన  కార్యదర్శి - 97019 33704)   

గుజ్జు అశోక్ కుమార్
   (కోశాధికారి-99088 98382)