ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అది అక్టోబర్ 9 , 2012. పదిహేను సంవత్సరాల మలాలా యూసఫ్ జయీ అనే బాలిక పైన పాకిస్తానీ తాలిబన్ తీవ్రవాదులు తుపాకులతో దాడి చేశారు.మధ్యాహ్నం పాఠశాల నుంచి వస్తున్న సమయంలో ఆమె ఉన్న స్కూలు బస్సు ఆపి ఆమెపై తూటాల వర్షం కురిపించారు.పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలనుకోవడమే ఆమె చేసిన నేరం. అమ్మాయిలు అబ్బాయిలతో కలసి దేశాభివృద్ధికి తోడ్పడటం తాలిబాన్లకు నచ్చదు.చదువుకోవడం షరియత్ ( ఇస్లామిక్ ధార్మిక చట్టం ) కు విరుద్ధమని భావిస్తారు.మలాలా అదృష్టవశాత్తు మృత్యువు నుంచి తప్పించుకుంది.ఆమె పై దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది.మలాలా నేడు అమ్మాయిల చదువుకు ప్రతీకగా మారింది.బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు భారతీయుడు కైలాశ్ సత్యార్థి తో పాటు అతి పిన్న వయసుక్కురాలైన మలాలా యూసఫ్ జాయికి 2014 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.పాకిస్థాన్ కి చెందిన ఈ సాహస పుత్రిక కథే ఈ పుస్తకం !ఈ పుస్తకం ధర : 80 కొనదలుచుకున్న వారు సంప్రదించగలరు : 9908284105
July 1, 2020 • T. VEDANTA SURY • Book Review