ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అదేగా వస్తుంది: జగదీశ్ యామిజాల
November 9, 2020 • T. VEDANTA SURY • Poem

గురువు నుంచి శిష్యులు 
తాము నేర్చుకునే విద్యపైన
ప్రేమ
అభిమానమూ 
ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తీ
ఇవేగాక ధైర్యమూ
స్వాభిమానమూ 
ఆత్మగౌరవమూ
ఉన్నతమైన విలువలూ
క్యారక్టర్ సంపాయించాలి.

ఈ గుణాలు 
బోధనలవల్ల వొచ్చేవి కావు
ముందు గురువులో 
అవి జీర్ణమై వుంటేనేగాని
శిష్యులకి రావు.

ఎక్కడ ఇంత కన్న
ఎక్కువ జీతమిస్తారా
ఎవరినాశ్రయిస్తే
ప.రమోషన్ వొస్తుందా అని
దేవిరించే ఉపాధ్యాయుడి నుంచి
ఏమొస్తుంది శిష్యుడికి
ఆ గుణమే తప్ప!

- (చలంగారి మ్యూజింగ్స్ నుంచి)