ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అనగనగా ఒక మామ(బాలాగేయం కథ)-పి.విశాలాక్షి.... హైదరాబాద్
November 1, 2020 • T. VEDANTA SURY • Poem

వినండి వినండి పిల్లలు
కథ చెబుతాను
కథ లాంటి నిజం
నిజం లాంటి కథ ఒకటి
వినండి వినండి పిల్లలు

అనగనగా ఓ మామ
చుక్కల పందిరికి పూచిన పువ్వు
అందరిని అలరించె  బంధువు
చల్లదనం పంచుతూ
చంటిపాపల జోలపాటలో
అమ్మ చేతి ముద్దలో
నేనున్నానంటూ ఆనందించే మామ
తనని చూసే వారు లేక
అందరికి దూరమవుతూ
వేదన పడుతున్నాడు
మూగగా రోదిస్తున్నాడు
ఆదరణ కోసం వేచిచూస్తున్నాడు
నాకు నిచ్చెన వేసేవారేవారు అంటూ
ఎదురు చూస్తున్నాడు...