ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అన్నదానం: డాక్టర్ . బి. వి. ఎన్ . స్వామి
October 5, 2020 • T. VEDANTA SURY • Story

ఆ రోజు కళాశాలలో కార్యక్రమాల జోరు సాగింది. ఒక వైపు స్టేజి కార్యక్రమం. ఇంకో వైపు భోజనాల తయారీ మరో దిక్కు విద్యార్థుల పరీక్షల తయారీ సన్నాహకాలు. వీటి మధ్య పోలీస్ జాగిలంలా తిరిగిన. సందర్శకుల సౌకర్యాల కల్పనలో మునిగిన. వచ్చిన ప్రధాన వక్త ధార్మిక విషయాలను చెప్పడంలో దిట్ట అని తెలిసింది. అతని ప్రసంగం వినాలని తహతహగా ఉంది.సెమినార్ హాల్‌లో మతం-మారణకాండ అనే విషయం పై చర్చ సాగుతుంది. బయ ఉండడం సాధ్యపడక హాల్ లోకి వెళ్ళి వెనక బెంచిలో కూర్చున్న. బుంగి ఎక్కడున్నడో అని చూసిన. కాని కనపడలేదు. ప్రంసంగం సాగుతున్నంత సేపు సవాలక్ష సందేహాలు నిద్రలేచినయి. వ్యక్తి శీల నిర్మాణం, ధర్మాచరణ, నైతికత లాంటి భావనలు మతం చుట్టూ తిరుగుతూ దానితో ముడివడుతూ ప్రసంగం సాగింది. ఏదో అనిశ్చితి. నన్ను నిలబెట్టి బయటకు సాగనంపింది.
బుంగి కోసం వెతుకుతూ వంట తయారీ వద్దకు వెళ్ళిన. అక్కడ కనిపించిండు. ఉపన్యాసం ముగిసిందేమో విద్యార్థులు, వక్తలు, సందర్శకులు అందరు భోజనాల వైపు వస్తున్నరు. వడ్డన కార్యక్రమం మొదలైంది. అందరు తృప్తిగా తిన్నరు. అన్నదానంలో పాల్గొన్న నాకు హాయి కలిగింది. సర్వప్రాణులకు సహజమైన ఆకలిని తీర్చడం ధర్మమే కదా! ఒక మానవీయ ఆచరణ ఎంత హాయినిస్తుందో తెలిసింది. ఒక పద్దతిగా జరిగే ధర్మాచరణలో ఉన్నందువల్ల నేమో బుంగిలో అనిశ్చితి కనిపించలేదు. కారణం బోధపడింది. ఏదో పట్టు పడినట్టనిపించింది.
ఇంచుకంత బోన మీశ్వరార్పణమన్న
పుణ్యలోకమునకు పోవునతడు
అన్నదానమునకు నధిక దానము లేదు
విశ్వదాభిరామ వినురవేమ
వేమన శతకం
వేమన