ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అన్నా చెల్లెలు--డా, కందేపి రాణి ప్రసాద్
October 15, 2020 • T. VEDANTA SURY • Poem

చెల్లంటే అన్నకు ప్రాణం
అన్నంటే చెల్లికి ధైర్యం
అన్నా చెల్లెళ్ళ అనుబంధం
మమకారాల రక్తసంబంధం

అమ్మలోని మొదటి అక్షరం
నాన్నలోని చివరి అక్షరం
కలగలిపితే అన్న!

అమ్మా నాన్న లకు చెప్పలేని
మనసులోని భావాల్ని
పంచుకునే అన్న!

ఆడపిల్లకు ఏ కష్టంమొచ్చిన
కంటనీరు పెట్టినా
రక్షక కవచం అన్నా!

అడిగిన వెంటనే దౌప్రదికి
మానరక్షణ చేసిన
శ్రీ కృష్ణుడే ఆదర్శ అన్నా!

బజారు కేళితే బాడీగార్డ్
బావ కాశీ యాత్ర కేళితే
తెచ్చి కాళ్లు కడిగే అన్న!

కోరుకుందే తడవుగా
కోరిందలా తెచ్చి ఇచ్చే
కనిపించే దైవం అన్న !

అమ్మా నాన్న లు 
రక్తం పంచి ఇచ్చిన
ప్రాణం ఉన్న బొమ్మ చెల్లి!

ఆటలు ఆడుకోవడానికి
దేవుడిచ్చిన తోబుట్టువు
స్నేహం పంచే చెల్లి
ఎక్కడికి వెళ్లినా ఎం చేసినా
చెయి పట్టుకొని తోడుగా
అనుసరించేది చెల్లి!

ఎల్లవేళలా కల కాలం
అన్న సౌఖ్యాన్ని కోరే
కల్పవల్లి చెల్లి!

అన్న ఇంట ఏ శుభకార్యమైనా
మంగలహారతులద్ధి 
మంచిని కోరే చెల్లి!

సోదర సోదరి ప్రేమకు గుర్తుగా
రక్షాబంధనం కట్టి
మమతలు పూయించే చెల్లి!

అందాల చిట్టి చెల్లి
అనురాగాల తీగమల్లి
ఆప్యాయతల పాలవెల్లి
ఆడపిల్ల ఇంటజాబిల్లి!