ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌
August 20, 2020 • T. VEDANTA SURY • News

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిం ది. కేంద్ర ప్రభుత్వ ప్రథకం ప్రకారం.. తొలుత రాష్ట్రంలోని రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దశలవారీగా మిగతా జిల్లాల్లోనూ అమలుచేయనున్నారు. ఈ మేరకు డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు ఆదేశాలు జారీచేశారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్‌లో బోధన కొనసాగుతున్నది. ఆన్‌లైన్‌ బోధనకు అనువుగా ఇంటర్నెట్‌ వసతి కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాలతోపా టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. దీనివల్ల 25 లక్షలకుపైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు.(నమస్తే తెలంగాణ సౌజన్యంతో )