ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అబ్దుల్ కలామ్ ఆరాధ్య (కైతికాలు)-లిఖిత్ కుమార్ గోదా, (ఆదిత్య శ్రీ)ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
October 15, 2020 • T. VEDANTA SURY • Poem


కలాం అడుగు జాడలతో
రామేశ్వరము తరించె
పేపరేసి చదువుకుని
దేశాన్ని పాలించె
వారెవ్వా మౌనముని!
జగతి మెచ్చిన విజ్ఞాన గని!!
చదువుకునెను ప్రీతితో
క్రమశిక్షణ సమేత
జగతి మెచ్చేలా అయ్యె
అంతరిక్ష శాస్త్రవేత్త
వారెవ్వా మిసైల్ మ్యాన్!
భారతీయ మహాన్!
కష్టాలు దాటుకుని
కలామయ్యెను విజేత,
పట్టుదలతో జీవితము
సాధించిన అధినేత
భారతరత్న కలాం!
భరతజాతికాదర్శం !!
మహర్షిలా మౌనముగా
మాటల రాశులు పంచెను
అందరికీ హితుడై
జీవితాన్ని నేర్పెను
కలాం వాక్కు ముత్యాలు!
పాటించే సత్యాలు!!