ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అబ్బ అబ్బ అన్నయ ఎంత బాగుందో రంగు రంగు ఓడలే బలేబలే వాన నీటిలో గబగబా ఉరుకుతున్నయ్ ఆహా! అన్నయ సేపపిల్ల లా సుర్రుమని పక్షులే నీటిలో దుంకి రెక్కలు టపటపయని ఎగిరిపోతుంటే ఎంత గమ్మత్తోయని నాకూ అలా ఎగురాలని ఉందిలే అన్నయ నీకూ అలా అనిపించలేదా? తమ్ముడు తమ్ముడూ! ఎందుకులేదు? ఆహా! పెద్ద పడవానే జేసీ మనం హాయిగా అందులో కూకోని ఎల్లి పోతుంటే ఎంతోబాగుండురా! ఆపక్షులోలే మనకూ రెక్కలుంటే ఈగొడుకెందుకూ ఆచెట్లలోనే ఆగట్లపైనా ఎంచక్క ఎగిరే పోతుంటామురా పద పద అమ్మ వస్తది పోదాం పదరా! -జయంత్ నమిలకొండ
August 8, 2020 • T. VEDANTA SURY • Poem