ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అబ్రహాం లింకన్--అబ్రహం లింకన్ (1809 - 1865) 1865 ఏప్రిల్లో హత్యకు గురయ్యారు. అమెరికాకు పదహారో అధ్యక్షుడిగా చరిత్రపుటల కెక్కారు. ఆయన పదేళ్ళ పిల్లాడికి రాసిన ఓ ఉత్తరం వేలంపాటలో పద్నాలుగున్నర కోట్ల రూపాయలకు ఒకరు దక్కించుకున్నారు. అమెరికాలో మహోన్నత వ్యక్తులలో ఒకరుగా గుర్తింపు పొందిన లింకన్ హత్యకు గురవడానికి కొన్ని వారాల క్రితం మంత్రి జాన్ యూజరిన్ కుమారుడైన లిండన్ యూజర్ కి ఓ ఉత్తరం రాశారు. లిండన్ పదేళ్ళ కుర్రాడు.ఆ ఉత్తరాన్ని తన కార్యదర్శితోనో లేక మరొకరితోనో రాయించలేదు. లింకన్ స్వయంగా రాసి సంతకం చేసిన ఉత్తరం అది.రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా పదవిని స్వికరించినప్పుడు చేసిన ప్రసంగంలోని చివరి పదమూడు వాక్యాలను లింకన్ ఆ లేఖలో రాయడం విశేషం.అమెరికాలో అంతర్యుద్ధం జరిగినప్పుడుకూడా యూజర్ కుటుంబీకులు ఈ ఉత్తరాన్ని పదిలంగా దాచుకోవడం విశేషం.ఈ ఉత్తరాన్ని పారంపర్య వేలం కేంద్రంలో ఈ ఉత్తరాన్ని వేలంవేశారు. అప్పుడు ఈ ఉత్తరాన్ని 22.13 లక్షల డాలర్రకు ఒకరు సొంతం చేసుకున్నారు.అయితే అంత ఖరీదుకి ఈ ఉత్తరాన్ని కొనుగోలు చేసిన వారి పేరును వేలందారులు వెల్లడించలేదు. పేరు గుట్టుగా ఉంచారు.దాదాపుగా ఇలాంటి ఉత్తరాలే అయిదు ఉన్నప్పటికీ పదేళ్ళ కుర్రాడికి రాసిన ఉత్తరాన్నే అమూల్యమైనదిగా భావించారు. - యామిజాల జగదీశ్
June 25, 2020 • T. VEDANTA SURY • News