ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అభయం ..: ----డా.కె .ఎల్.వి.ప్రసాద్,--హనంకొండ.
November 9, 2020 • T. VEDANTA SURY • Poem

ఆన్ లైన్ బడిలో 
అన్నీ వింతలే ...!

అసలుబడితో 
దీనికి దేనిలోనూ 
పొంతనలేదులే !

బడిలేదు ...
అన్నమాట లేకుండా ,
బడి అన్నట్టు కాకుండా ,
కదిలే బొమ్మలు చూసి 
మెదిపే పెదవుల కృషి !

అక్కడ చెప్పింది 
ఇక్కడ చేయడం ,

ఇక్కడ చేసింది 
అక్కడికి చూపించడం ,

ఆధునిక పరిజ్ఞానం 
అక్కరకు వచ్చింది !

కరోనా ..వైరసు 
కకావికలం చేసినా 
విద్యారంగం ..
విశ్రాంతి తీసుకోలేదు 

విద్యా సంవత్సరం 
వేస్టుకాకుండా ...
మార్చింది పద్దతి !

భవితలో 
ఉపద్రవాల తాకిడికి ,
భయంలేదని వినికిడి !!