ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అభినవగుప్తాచార్యుడు..---సుజాత.పి.వి.ఎల్.
September 7, 2020 • T. VEDANTA SURY • Story

ఏ విషయం గురించి రాసినా క్షుణ్ణంగా పరిశీలించి ప్రామాణికంగా రాయగల సమర్థుడు అభినవగుప్తుడు. కాశ్మీరు నుంచి కామరూప దేశానికి (కామరూప దేశం అంటే భారత దేశానికి ఈశాన్య దిక్కులో ఉన్న అస్సాంని పూర్వం కామరూప దేశం అని పిలిచేవారు.) తరలివచ్చి నివసించిన గొప్ప మంత్ర శాస్త్రవేత్త, తాంత్రికుడు. నాట్య, అలంకార శాస్త్రాల్లో దిట్ట. అభిచారిక ప్రయోగంలో ప్రవీణుడు అభినవ గుప్తాచార్యుడు. శాక్త సంప్రదాయానికి చెందిన వాడు.
భరత నాట్య శాస్త్రానికి అభినవ భారతీ వ్యాఖ్య. ఆనందవర్థనాచార్యుని ధ్వన్యాలోకం అనే అలంకార శాస్త్ర గ్రంథానికి లోచన వ్యాఖ్య, తంత్ర లోకం, శాక్త భాష్యం రచించాడు అభినవగుప్తుడు.