ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మాయీ..: జగదీశ్ యామిజాల
November 9, 2020 • T. VEDANTA SURY • Story

నా ఒడిలో ఆట్లాడుకునే దేవతవు

 మనసంతా వికసించిన కలువ పూవే

నాన్న అనే హోదాను

నీ రాకతో నేను పొందాను

జీవితార్థాలను నువ్వు చెప్పినంతందంగా

ఇంకెవరు చెప్పగలిగారు కనుక....

నాలో తొంగి చూసిన కష్టాలనూ కన్నీళ్ళనూ

నీ నవ్వులతో తరిమికొట్టావు

ప్రేమనే జలపాతాన్ని

ఆస్వాదించేలా చేస్తున్నావు నీ చిలిపి చేష్టలతో

నా మనసు నీతో

ఎప్పటికీ ఆగిపోని నదీప్రవాహమేసుమీ


నాన్నా అనే నీ ఒక్క పిలుపుతో

ఎంత ప్రేమో ఎంత ధీమానో


నీ చేయి పట్టుకుని నడిచొస్తున్న దూరాలన్నీ

దగ్గరవుతున్నాయి


నువ్వు పుట్టిన వేళ

నేను నాన్నలా పుట్టాను

నువ్వు చూపే ప్రపంచం నిండా

మధుర దృశ్యాలే

నీ మాటలతో

నీ చేతలతో
నీ నడకతో

నిండు పున్నమైనా బోసిపోవలసిందే

నా హృదయమనే కోటను

పాలించే యువరాణివి నువ్వేగా తల్లీ

నీకిది ఆనందంతో అంకితం చేస్తున్నా