ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మే ఆదర్శం! ----సుజాత.పి.వి.ఎల్.
September 2, 2020 • T. VEDANTA SURY • Story


గాంధీ గారి తల్లి పేరు పుతిలీబాయి. ఆమె ఆదర్శ మహిళ అనడానికి ఇది ఓ యదార్థ సంఘటన. భారతీయ సంస్కృతిని చిన్నప్పటి నుంచి అలవరచుకున్నమాత. ఆమె ఒక వ్రతం ఆచరించేది. అదేమిటంటే ప్రతి దినము కోయిల కూసిన తరువాతే తాను భోజనం చేసేది.గాంధీజీ చిన్న పిల్లవానిగా ఉన్నపుడు ఒకనాడు తన అమ్మ భోజనం చేయకుండా కోకిల కూత కై చాలా సమయం వేచి ఉండటం గమనించి వెంటనే తాను బయటికి వెళ్లి  కోయిలలా కూసాడు. తదుపరి లోపలికి వచ్చి''అమ్మా! కోయిల కూసింది ఇక నువ్వు భోజనం చేయొచ్చు!'' అన్నాడు.  అబద్దం చెప్పాడని గ్రహించిన పుతిలీబాయి గాంధీని పట్టుకుని రెండు చెంప దెబ్బలు కొట్టి ''ఇంకెప్పుడు నీ నోటి వెంట అసత్య పలుకులు రాకూడదు'' అన్నది కోపంగా. ఆనాటి నుండి అసత్యమాడలేదు మన గాంధీజీ.ఈ విధంగా సామాన్యులను కూడా మహనీయులుగా తీర్చగల శక్తి సామర్ధ్యాలు అమ్మకే ఉంటాయి. అందుకే అన్నిటికి అమ్మేమూలం అమ్మే ఆదర్శం!