ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మ ఒక జ్ఞాపకం --డా. కందేపి రాణి ప్రసాద్
September 29, 2020 • T. VEDANTA SURY • Memories

అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్బంగా అంగలకుదుటి వంశం ఇంటి కూతురిగా నేనీ వ్యాసం రాస్తున్నాను మా అమ్మ అంగలకుదిటి గోవిందమ్మ గత నెల రోజులుగా అమ్మ తో గల జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూనే ఉన్నాను గత నెలలో ఇదే తారీకున మరణించారు మా అమ్మ కథల పోగు ,పాటల పేటి భక్తురాలు మా అమ్మ స్వాతంత్ర్యనికి పూర్వమే పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చింది అప్పట్నుంచి మా నాన్న కీ శే, అంగలకుదిటి సుందరాఛార్యులు గారు గాంధీజీ దేశం కోసం చేస్తున్న ఉద్యమం గురించి ఆంగ్లేయులు భారత దేశాన్ని దోచుకుంటున్న వైనం గురించి వివరించారు వారు అప్పటికే స్వతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు అంతేకాక స్త్రీ విద్య వ్యాప్తి కోసం పెట్టిన కస్తూరి బా కేంద్రంలో అమ్మను 8వ తరగతి వరకు చదివించారు భగవద్గీత లోని శ్లోకాలు కంఠో పారంగా నేర్చుకుంది అమ్మ సంస్కృతం ,హిందీ,పరీక్షలు రాసింది ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో ఒక స్త్రీ వివాహం తర్వాత కూడా చదువు కొనసాగించడం చాలా ఆదర్శవంతమైన విషయమని గుర్తించిన జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మా అమ్మకు రికార్డు నిచ్చి గౌరవించారు రెండు సంవత్సరాల క్రితం అమ్మ బాలల కోసం జానపద కథల పుస్తకాన్ని ప్రాచురించారు  అంటే తన 85 ఏళ్ళ వయసులో రచించింది మరణాంతరం అమ్మకు ఈ రికార్డు రావడం చాలా సంతోషంగా ఉంది, అమ్మ ఎనాడు నన్ను మందలించలేదు ఒక్కసారి కొనసాగించుకోలేదు అమ్మకు పెళ్లయిన ఇరవైఏళ్లకు పుట్టాను నేను అలా అని గారభం మేం చెయ్యలేదు మేము అల్లరి చేయలేదు ఒకవేళ తెలియక తప్పులు చేసినా నిదానంగా చెప్పేది నాకు ముద్దకుట్టు ,గొలుసు కుట్టు అంటూ మొదలుపెట్టి అన్ని కుట్లు నేర్పేది ఇంట్లోని వ్యర్థ వస్తువులతో ఉపయోగపడే  వస్తువులను తయారుచేసినపుడు చాలా సంతోషించేది తను చాలా కొత్త ఐడియాలు ఇచ్చేది నేను చిన్నప్పుడు 24గంటలు బొమ్మలు వేస్తున్నా " ఎవింటి పిచ్చి బొమ్మలు" అని అరవలేదు ఒక్కొక్క బండరాయి మీద ఒక్కొక్క బొమ్మ వేసుకో అని ఇల్లంతా నాకు అప్పజేప్పేది నేను రాసిన కవితలు చదివి చాలా మురిసిపోయేది సహరచయితలు పంపిన పుస్తకాలను మొదటగా తానే చదివేది నేను హాస్పిటల్ వ్యర్థాలతో బొమ్మలు చేస్తుంటే విసుగు లేకుండా చేస్తుండేది అసలు అమ్మ అనే కన్నా నాకు సాహితీ స్నేహితురాలు అనవచ్చు