ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మ-నాన్న--చెన్నమనేని ప్రేమసాగర్ రావు
August 26, 2020 • T. VEDANTA SURY • Poem

అంతాభారం ఆమ్మానాన్నదే
బాధ కలిగినా భయం కలిగినా
కన్నీళ్ళయినా
మందహాసమైనా
మురిపమైనా
ముచ్చటైనా
కష్టమైనా, సుఖమైనా
నష్టమైనా, లాభమైనా
అంతా చెప్పుకునేది అమ్మానాన్నలతోనే

ధైర్యానికి నిర్వచనం
బతుకుకు భరోసా అమ్మానాన్నల ఆశీర్వచనం
వాళ్ళున్నంత వరకు నేను ఎతలు తెలువని మనిషినే
ఇప్పుడు
అన్నీఅమరినవి కానీ
చెప్పుకునేందుకు అమ్మానాన్న లేరు
వాళ్ళకై ఎత నామది నిండుకుంది -!