ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మ భాష:-- జగదీశ్ యామిజాల
August 29, 2020 • T. VEDANTA SURY • News

అమ్మ 
భాష
కలసిమెలసి ఉండటంవల్లే
అమ్మభాషకంత మాధుర్యం
అమ్మభాషకంత ఆకర్షణ
అమ్మభాషకంత అందం
అమ్మభాషకంత వెలుగు
అమ్మభాష వేలు పట్టుకుని
వేసే ప్రతి అడుగూ 
ముందడుగుకి ఓ పునాది
అమ్మభాషని సుందరమైన భాషని
పొరుగురాష్ట్ర తమిళ కవి 
సుబ్రహ్మణ్యభారతి ప్రశంసించినా
మనం మాత్రం అమ్మభాషను మరిచి
ఇంగ్లీషు వ్యామోహంలో పడి కొట్టుకుపోతుంటాం
 ఇతర భాషలపై ఎంత మోజున్నా
ఆలోచించేది అమ్మభాషలోనే అనే నిజాన్ని 
తోసిపుచ్చగల చేవ ఉంటుందా ఒక్కరికైనా
ఎంతైనా చదవొచ్చు
ఎన్నయినా సాధించొచ్చు
కానీ 
అమ్మభాషను ప్రేమించకుంటే
ఎంతున్నా లేనట్టే
అమ్మభాషకున్న శక్తి 
ఇంకెక్కడిది...
అమ్మభాషను నిర్లక్ష్యం 
చేయడమంటే 
జన్మనిచ్చిన అమ్మను
అవమానించినట్టే
అగౌరవపరచినట్టే
కనుక
అమ్మతోపాటే భాషనూ 
ప్రేమిద్దాం 
నియమనిబంధనలకతీతంగా