ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మ - ఆరవేటి రాజకుమార్
November 17, 2020 • T. VEDANTA SURY • Poem
హృదయ కోవెల గుడిలో
పలికే మధుర స్వరం అమ్మ.
వరతనూజకు వెలుగు నింపే
ప్రేమ దీపము అమ్మ.
 
శిశువు ఆయువు పెంచే
ప్రేమ మంత్రము అమ్మ.
బిడ్డల బాగుకై దీవెనలిచ్చే
ఆశీర్వాద ఝరి అమ్మ.
 
పిల్లల బ్రతుకు జీవితంలో
ఉషోదయ కిరణం అమ్మ.
ఆశీర్వాద వెన్నెల నిచ్చే
చల్లని జాబిలి అమ్మ.
 
గోరుముద్దలు తినిపిస్తూ
ప్రేమామృతం పంచును అమ్మ.
లాలి పాటలు పాడుతూ
ధైర్యము పంచును అమ్మ.
 
వేలకొలది పదాలలో
మధురపదం అమ్మ.
ధరణిపై వెలసిన 
కరుణ దైవము అమ్మ .
 
 
     ఆరవేటి రాజకుమార్
యమ్.ఏ యమ్.కాం బి.ఈడి
            కర్నూలు