ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అమ్మ : --పి. విశాలాక్షి--హైదరాబాద్
November 8, 2020 • T. VEDANTA SURY • Poem

 అమ్మకు సాటి ఎవరు
అమ్మకు పోటీ ఎవరు
దేవుడు కూడా అమ్మ బిడ్డడే
అవని అంత ఓర్పు అమ్మ సొంతమే

 లాలి పాటలో బుద్ధులు నేర్పేది అమ్మ
అందని చందమామని గోరుముద్దలతో
అందించేది అమ్మ

 వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ
అమ్మతనం లోని బంధాన్ని విలువిస్తూ
జీవితసారం నేర్పుతుంది అమ్మ

 ఇలలో మరువలేనిది అమ్మ
తీర్చలేని కొరత అమ్మ ప్రేమ
దెబ్బ తగిలినప్పుడు గుర్తొచ్చేది అమ్మ
చివరిక్షణంలో గుర్తుచేసుకునేది అమ్మ ప్రేమనే