ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అయితే నాకు చెప్పకండి--- జగదీశ్ యామిజాల
October 14, 2020 • T. VEDANTA SURY • Story

సోక్రటీస్ వద్దకు ఓ పరిచయస్తుడు వచ్చాడు. మీ మిత్రుడి గురించి చెప్పాలని వచ్చానన్నాడా పరిచితుడు.

అప్పుడు సోక్రటీస్, "అయితే నేను మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. వాటికి మీరు లేదు అనే జవాబు చెప్తే నాకతని గురించి చెప్పకండి" అన్నారు. 

సోక్రటీస్ అడిగిన మొదటి ప్రశ్న...
"మీరతను చేసిన పనిని ప్రత్యక్షంగా చూసేరా?" 

పరిచయస్తుడి జవాబు "లేదు" 

సోక్రటీస్ రెండో ప్రశ్న...
"మీరు అతని గురించి మంచి విషయాన్ని చెప్పబోతున్నారా?"

పరిచయస్తుడి జవాబు "లేదు"

సోక్రటీస్ మూడో ప్థశ్న ...
"మీరు చెప్పబోయేది ఎవరికైనా ఉపయోగపడేదేనా?"

పరిచయస్తుడి జవాబు "లేదు"

"అయితే నా మిత్రుడి గురించి మీరు నాకేదీ చెప్పక్కర్లేదు. మరేదైనా మంచి విషయముంటే చెప్పండి వింటాను. లేకుంటే దయచేయండి" అని అనడంతో సోక్రటీస్ వద్దకు వచ్చిన వ్యక్తి మరొక్క మాట మాట్లాడితే ఒట్టు.