ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అవసరం ...:-డా .కె .ఎల్వీ --హనంకొండ .--ఫొటొ: ఆన్షి నల్లి.
October 30, 2020 • T. VEDANTA SURY • Poem

తాత ప్రతి ఉదయం 
నడిచే 'నడక' చూశా ,!

అమ్మమ్మ ప్రతిరోజూ 
చేసే ..' ట్రెడ్మిల్ 'చూశా ,!

అమ్మ నిత్యం చేసే ,
' యోగా ' చూశా ...!

డాడీ ..అప్పుడప్పుడు 
' ట్రేడ్ మిల్ ' చేయడమూ 
బాగా గమనిస్తున్నా....!

ఇప్పుడు ...
అందరికి వ్యాయామం 
అవసరం అని తెలుసుకున్న ,!

అందు కే----
ప్రతి ఉదయం 
సూర్యోదయ సమయానికి ,
మిద్దె మీదికి -
వెళ్లడం నేర్చుకున్నా...!

నులివెచ్చని ఎండలో,
పరుగులు తీస్తున్నా...
ఆటలు ఆడుతున్నా...
వ్యాయాయంచేస్తున్నా,!
మరి ...మీ రో......!!