ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అవసరం ..:--డా.కె .ఎల్.వి.ప్రసాద్ --హనంకొండ.
November 21, 2020 • T. VEDANTA SURY • Poem

అవసరం అనుకుంటే ,
అబద్దాలకు ...
కొదవలేదు ,
ఒక మంచి పనికోసం ,
అబద్దం ..
ఆపత్బాంధువు 
అవుతుంది !

నిజం చెబితే ...
నిష్టూరపడే 
బంధు మిత్రులకు ,
అబద్ధంతోనే 
ఆనందం కలిగిస్తాను.!

మతి మరుపులో ...
అతిగా ..
ప్రవర్తిస్తాను ...
చెప్పింది కాదంటాను,
కాదన్నది _
ఔనంటాను ,
నేను చెప్పిందే రైటు అన్నట్టు ,
బల్ల గుద్ది వాదిస్తాను !

నా ..బ్రతుకు బాటలో ,
అనుభవాల తోటలో ,
అబద్దం 
ఒక రక్షక కవచం 
అవసరానికొక 
అద్భుత సూత్రం ...!!