ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
అoతరం:--కె ఎస్ అనంతాచార్య
November 10, 2020 • T. VEDANTA SURY • Poem

కనుల అనుభవం కాయానికి దక్కదు కడుపు బాధ  కనులది కాదు
చూసిన ప్రతి అందం  మనకు దక్కదు 
అన్నీ దక్కాలనుకుంటే చిక్కుల్లో చిక్కక తప్పదు

మెట్టు మీద పాదం మోపేటప్పు డే శిఖరం పై ప్రేమ పుడితే నిర్దేశిత లక్ష్యం చేరువవుతుంది

దృష్టి కి వచ్చిన విషయాన్నల్లా  విమర్శించి  
చక్రవర్తివని వీగిపోకు
లో చూపుతో సరిదిద్దుకుంటే
  విజ్ఞత కొనదేరుతుంది !

బాహ్య దృష్టి తో తప్పులెన్నటం కాదు అంతరాల్లో చిక్కిన  సత్యo  గుట్టు విప్పటం కావాలి

పై మెరుగుల చూసి మురిసిపోవటం కాదు కూపీలాగి  మూలాలను నిలబెట్టడం

లో ఆత్మకన్నా గొప్ప గురువు ఎవరు చుక్కాణిలా నావకు దారి చూపుతుంది

బుద్ధి ప్రచోదనం తోనే కదా
 ఆశయాలకు జీవం 

సూటితనం తో తనను తాను తెలుసుకొని దూషణ భూషణలు మానుకొని గెలుపుకు విజ్ఞతతో పలికితే బహుపరాక్ 

చూడాల్సింది పెదాల మీద లిపిస్టిక్ లు కాదు  వినాల్సింది
హృదయాంతరంగపు  అలికిడిని


అభ్యాసం చేస్తే తప్ప లోతు తెలియదు
మనసు ఏకాగ్రమైతే తప్ప జ్ఞాన నేత్రం విప్పుకోదు