ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆంజియోగ్రామ్--గుండె లోని బ్లడ్ వెసల్స్ పరిస్థితిని కనుగొనడానికి, చికిత్స చేయడానికి ఈ ఆంజియోగ్రామ్ అనే ప్రొసిజర్ ను చేస్తారు.గుండెకు రక్తాన్ని చేరవేసే రక్త నాళికల గోడలు కొవ్వు పదార్థాలతో నిండిపోవడం వలన గుండెకు రక్త సరఫరాలో అంతరాయం జరుగుతుంది.గుండెకు రక్తం అందకపోవడం వల్ల చాతిలో నొప్పి, ఊపిరి పీల్చడానికి ఇబ్బంది కలగడం, గుండెలో ధడ, కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఈ లక్షణాలు కనిపించినప్పుడు మొదటగా ఈసీజీ,2డీఈకో, థ్రెడ్ మిల్ టెస్ట్ చేస్తారు.ఆ తరువాత రక్త నాళికలు ఎంత శాతం మూసుకుపోయాయో తెలుసుకోవడానికి కొరొనరీ ఆంజీయోగ్రామ్ చేస్తారు.దీనిలో భాగంగా మొదట పేషెంట్ కు మిడాజోలమ్,ఫెంటానిల్,అనే మత్తు ఇంజెక్షన్లు తొడ మీది బాగాన ఇస్తారు.దీనితో పేషెంట్ నిద్ర పోవడం జరగదు కానీ విశ్రాంతిగా, వుంటాడు.కాథటర్ ను లోపలికి పంపినప్పుడు ఎలాంటి నొప్పి వుండదు. మిగితాది రేపు...... ప్రమోద్ ఆవంచ
August 5, 2020 • T. VEDANTA SURY • Serial