ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆందోళన (Tension)తగ్గడానికి.-- పి . కమలాకర్ రావు
November 3, 2020 • T. VEDANTA SURY • health tips

 మానవ జీవితంలో అప్పుడప్పుడు బాధలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు ఎక్కువ అయినప్పుడు నిద్రలేమి అసహనం ఎక్కువై ఏ పరిష్కారము దొరకనప్పుడు ఆందోళనకు దారి తీస్తుంది. దీనివల్ల తలనొప్పి ఎక్కువై మానసిక అనిశ్ఛితి మొదలవుతుంది. ఇలాంటి సమయంలో ఏకాగ్రతతో ధ్యానం చేయడంవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిదానంగా ఆలోచించినప్పుడు సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఒక గిన్నెలో నీరు పోసి కొన్ని ధనియాలు, నల్ల గొట్టిన యాలకులు వేసి మరిగించి అందులో తాటి బెల్లం కూడా కలిపి చల్లారిన తర్వాత త్రాగాలి. ఈ కషాయం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. టెన్షన్ను పూర్తిగా తగ్గిస్తుంది. దీనితో పాటుగా సరస్వతి ఆకుల కషాయం లేదా అశ్వగంధ చూర్ణంతో చేసిన కషాయం త్రాగితే పూర్తిగా మనసు కుదుటపడుతుంది..