ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆక్లాండ్ లో హలో వీన్ డే : టి. వేదాంత సూరి
October 31, 2020 • T. VEDANTA SURY • News

నా చిన్నప్పుడు దసరా కంటే ముందు ఖానిగి బడుల్లో (ప్రైవేట్ పాఠశాలల్లో ) చదువుకునే వారు.. రంగు రంగులుగా అలంకరించిన కర్రలు పట్టుకుని వాటినే గడలు అనే వారు. ఉపాధ్యాయుడితో తమ ఇంటికి వెళ్లి గడల పద్యాలు చదివి వారిచ్చిన డబ్బు లేదు పప్పు బెల్లాలు తీసుకునే వారు. అదే విధంగా హోలీ కంటే ముందు జాజిరి పాటలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్లే వారు. ఈ అలవాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో వుంది. అదే విధానంగా అక్టోబర్ 31వ తేదీన చాలా దేశాలలో హెల్లౌ  వీన్ డే  జరుపుకుంటారు. చనిపోయిన వారి ఆత్మలు శాంతించాలని కోరుకుంటూ పిల్లలు రక రకాల వేషధారణతో ఇంటింటికి వెళ్లి బహుమతులు అందుకుంటారు.చర్చ్ లలో ఉదయమే ప్రార్థన జరుపుతారు. పిల్లలకు ఆటలు, పాటలతో ఆనందాన్ని పంచుతారు. సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తారు. అదే విధంగా ఇళ్లల్లో కూడా దెయ్యాలు, కపాలాల రూపాలతో అలంకరిస్తారు. వారి ఇళ్లకు పిల్లలు వస్తే బహుమతులు పంచుతారు.ఈ పండుగ 1745 నుంచి ప్రారంభమైనట్టు చెబుతారు. ఏదెలా వున్నా ఈ పండుగ మన పండుగలు గుర్తుకు రావడం విశేషం.