ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది పద్యాలు --జాధవ్ పుండలిక్ రావు పాటిల్--9441333315
September 17, 2020 • T. VEDANTA SURY • Poem

తెనుగు ఊరి వెలుగు తెలుగుభాష జిలుగు
మాతృ యాస కొరకు మనసు నిల్పి
అన్య భాష లందు అనురాగ ముంచెను
సామల బహుభాష సౌమ్య మూర్తి

సెల్లు ఫోను వచ్చి సెల్ఫీలు తెచ్చెను
సొల్లు కారు చుండ సోకు మీర
తనదు బొమ్మ తీయ తహతహ పెరిగేను
కీడు మేలు మరచి గీక తేల

స్వర్ణ జింక జూచి సంబుర పడినది
మోజు పడుచు పతితొ మొరయె బెట్ట
సీత వాంఛ దీర్చ శీఘ్రంగ రాముడు
వెడలె కాన లోకి వేడ్క మీర

దొరల దోపిడిలను తొలిగించ చాకలి
వీరవనిత జేసె కరము చేత
బట్టి పోరు నాడు భయమేమి లేకయు
నిలచి పోయె నెపుడు నిలన పేరు

కేసరి  సుతుడేగె కేలులు చాచుతూ
బాలభాను మ్రింగ ఫలమనుకొని
నింగిచెంత కాల్చె నిప్పులు ముఖము
తల్ల డిల్లె హనుమ తల్లి మనసు