ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆటవెలది..పూలబాట--..జాధవ్ పుండలిక్ రావు పాటిల్--9441333315
October 5, 2020 • T. VEDANTA SURY • Poem

ఆలి మాట విన్న అవనినేలగ వచ్చు
సాని పలుకు వింటె హాని కలుగు
భార్య చెంత నుండ బయట తిరుగుటేల
పుండలీకు మాట పూలబాట

పాడు బుద్ధి యున్న పాడగు నుమనుసు
మంచి బుద్ధి యుంటె మమత దొరుకు
మమతయున్నవాడుమహనీయు డగునయ్య
పుండలీకు మాట పూలబాట

కంటి లోని పాప ఇంటిలో కులకాంత
యుండు వేళ  వెలతి యుండ బోదు
లేని నాడు బ్రతుకు రెక్కలి రచినట్లు
పుండలీకు మాట పూలబాట

ఆవు పాలు త్రాగ ఆరోగ్యము  కలుగు
మేక పాలు గ్రోల మేలు కలుగు
అమ్మ పాలు త్రాగ ఆయుష్షు పెరుగును
పుండలీకు మాట పూలబాట

ఎండ వేడి తొలగు ఐసుక్రీము తిన్నను
చల్ల గుండు నదియు చక్క గుండు
ఉపశమనము నకది ఉత్తమ మార్గము
పుండలీకు మాట పూలబాట