ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆడజన్మ -- --కళావతి కందగట్ల-- హైదరాబాద్
October 13, 2020 • T. VEDANTA SURY • Poem

ఆడపిల్ల అని నీవు 
అలుసుగా చూసేవు ఏమి 
ఆడ మగ అని తేడా లు
చూపిస్తావు ఏల నీవు... 

 ఆడపిల్ల లేని ఇల్లు
 దీపం లేని కోవెల రా
చిన్నారి తిరిగేటి ఇంట 
లక్ష్మిదేవి నడిచి వచ్చురా 
 సృష్టికి మూలం ఆడజన్మ అని
 తెలుసుకో రా...నీవు 

 అమ్మ కడుపున పుట్టి
 అక్క చెల్లి తో పెరిగి
 మగువను మనువాడి
అన్ని సుఖాలను పొందుతావు
నీవు... అయినా.... //ఆడపిల్ల //

 ఆలి కడుపులో పెరిగే టి నలుసు
 ఆడకూతురు అని తెలిసి
 కనికరమే లేకుండా నీవు
 పిండాన్ని కరిగించి
 ఆడజన్మనే అడ్డు ఉంటావు 
 నీవు....//ఆడపిల్ల //

 గండాలన్నీ దాటి బిడ్డ
 బతికి బయటపడ్డ గాని...
 బండరాయి లెక్కమారి నీవు
 బిడ్డకు కరెంటు షాక్ ఇస్తావు
 లేదంటే గొంతు నులిమి   చంపుతావు....
//ఆడపిల్ల //

 మద్యం కోసమూ  నీవు
 పాలు తాగే పసి దాన్ని
 పాషాణ మనసుతో నీవు
 నాలుగు బాటల కాడ
 అమ్మకానికి పెడతావు
 బిడ్డను అమ్మకానికి పెడతావు...
//ఆడపిల్ల //

 అమ్మనే లేకుంటే నీకు
 జన్మ ఎట్లా వచ్చేది చెప్పు
 ఇకనైనా మారాలి నీవు
 తెలుసుకోవాలి నీ తప్పు...
 ఆడదే లేకుంటే అవని
 తరువు లేని  బీడు భూమి...
//ఆడపిల్ల //

 ఆడదంటే అబల కాదు
 ఆదిశక్తి యే కదరా... 
 సృష్టికి మూలం
 ఆడజన్మ అని
 తెలుసుకోర... నీవు 
తెలుసుకోర.. నీవు