ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆడపిల్లలంకాదు,అగ్గిపుల్లలం: ----పోలయ్య కవి కూకట్లపల్లి--హైదరాబాద్ - 9110784502
October 14, 2020 • T. VEDANTA SURY • Poem

ఓ అమ్మాయిల్లారా !
నిన్న మీ అక్కలు 
నిర్భయ, దిశ, ఆయేషా
నేడు హత్రాస్ లో 
మీ దళిత చెల్లి మనీషా 
మానవమృగాలైన
కళ్ళుపొరలు కమ్మిన
కామాంధుల కబంద 
హస్తాలలో నలిగిపోయారని
అత్యాచారానికి గురయ్యారని
చిత్రహింసలు అనుభవించారని

పెట్రోల్ పోసి తగలబెడుతుంటే
హాహాకారాలు చేస్తూ కళ్ళముందే 
కాలి బూడాదైపోయారని, 
అందంగా ఆడపిల్లలుగా పుట్టడమే
మేము చేసిన "తప్పని" 
అడుగడునా "ముప్పని"
ఆడపిల్లలకన్న ఆకాశంలో
పక్షులే స్వేచ్ఛగా జీవిస్తున్నాయని
కలత చెందకండి‌ ! కన్నీరు కార్చకండి!
భయపడకండి ! బాధపడకండి!

సమతావాదులంతా
మానవతావాదులంతా
అందబేత్కరీయులంతా 
అభ్యుదయవాదులంతా
మీ వెంటే మీ వెనుకే వున్నారు
మీరు ధైర్యంగా వుండండి !
జాగ్రత్తగా వుండండి, ఐతే

న్యాయం జరిగేంతవరకూ
దోషులకు శిక్ష పడేంతవరకు
ఓపిక వున్నంతవరకూ, కాదు
ఊపిరి ఉన్నంత వరకు పోరాడండి !

"కత్తులు" సిద్దం చేసుకోండి
కళ్ళుపొరలు కమ్మిన కామాంధుల 
కుత్తుకలు త్రెంచడానికి
"ఉరితాళ్శు" సిద్దం చేసుకోండి
మీరు ఉరివేసుకోవడానికి కాదు
ఉన్మాదులను ఉరితియ్యడానికి

"ఆడపిల్లలం కాదు, 
మేము అగ్గి పుల్లలమని"
"మా నాలుకలు కోస్తే 
మీ పీకలు కోసేస్తామని"
ముక్తకంఠంతో దిక్కులు 
పిక్కటిల్లేలా నినదించండి !
రాజ్యాంగమే 
మీకు రక్షణ కవచమని
ప్రజాస్వామ్యమే 
మీకు శ్రీరామరక్షయని 
రామరాజ్యంలో 
రాక్షస రావణులుంటారని
ప్రశ్నిస్తేనే,సంఘటిత శక్తిగా
ప్రతిఘటిస్తేనే, ఉద్యమిస్తేనే
స్త్రీ జాతికి ఉషోదయమన్న 
నగ్నసత్యాన్ని మాత్రం మరువకండి!