ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆత్మసైర్ధ్యం----సాగర్ రెడ్డి--చెన్నై
November 17, 2020 • T. VEDANTA SURY • Poem

వేగంపుంజుకుంటూ
సాగుతున్న బతుకుబండి.
భయం గుప్పిటనుంచి
భయటపడి-
ధైర్యమనే వెలుగు
రేఖల తోడుతో-
జీవనరధాన్ని
నడుపుతున్న
జనావళి!!

ప్రారంభంలో-
పంజావిసిరి
భయోత్పాతం
సృష్టించిన
కరోనా మహమ్మారి
ప్రభావంతగ్గించి-
జనుల ఆత్మసైర్ధ్యాన్ని,
పెంచింది-
కర్తవ్యాన్ని బోధించింది!!

కాలంతో కలసి,
విపత్తులనైనా,
విషాదాలనైనా,
ఎదుర్కొని
జీవనయానాన్ని
సాగించడమే
మనిషి లక్ష్యం-
లేదు మరోమార్గం!!

ఈ ఆనందమయ
ప్రయాణం-
సంతోషంగా సాగుతూ
అందరి ఆశలను,
నెరవేరేలా-
ఆనందమయ జీవితానికి నాందిగ
నిలిచిపోవాలని ఆశిద్దాం!!