ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆత్మీయత:-కె ఎస్ అనంతాచార్య
September 12, 2020 • T. VEDANTA SURY • Poem

ఆశ కొ డిగట్టుకుపోయి నప్పుడు
అవకాశాలు ఆవిరైనప్పుడు 
అందించే ఓదార్పు

వెతికిన కళ్ళకు నిరాశ
చేతులు ముడుచుకున్న నిస్సహాయత 
అద్దం లాంటి నమ్మకం పగిలి నప్పుడు అల్లుకొనే ఆలంబన

నుదిటిమీది ఆనందం 
చెమటతో కలిసి ఆహ్లాదం
వాతావరణం కలుషితమైన పుడు
అందించే స్వచ్చమైన గంగా జలం

నిస్పృహ లోంచి
ఏకాగ్రత తప్పిపోయి
విహారెంచే మత్తులోకం లోంచి 
బయటకు తెచ్చే  పారమార్థికత

కుట్లు తెగిన మనసు సంచికి
 భరోసా కుట్లు వేసి ఒంటరి తనాన్ని
తుంటరి  ఆలోచనలకు స్వస్తి చెప్పే చాణిక్య పథకం

చిన్నమాట చిటికెడు స్వాంతన
వడ్డించ గలిగితే గుండె నిండి
ఆర్ద్రత ఉప్పొంగుతుంది

కుటుంబం కకావికలమై,కరుణ కరువై 
కంటి ధారలు కారినప్పుడు
తెలిపే రెండక్షరాల సానుభూతి 
,పొందే సహనుభూతి

ఆత్మ న్యూనత కి
చిట్టి సలహా అందిస్తే
ఆశల చేట్టు పెరిగి
విశ్వాస పు పండ్లు
విరగ కాస్తాయి

జంట బాసిన ఒంటరికి
తోడై నిలిచే ప్రేమ హస్తం

తనను  కోల్పోయి
 తనువు వశం తప్పినప్పుడు
అందించే స్నేహ హస్తం