ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆత్మీయ బంధం....: మొహమ్మద్ అఫ్సర వలీషా--ద్వారపూడి (తూ గో జి)
November 16, 2020 • T. VEDANTA SURY • Poem

అన్నా చెల్లెళ్ళ బంధం ..

ఆకాశం  కంటే  ఎత్తైనది 

భూమి  కంటే  విశాలమైనది

నదుల  కంటే  పొడవైనది

సముద్రము  కంటే  లోతైనది

చంద్రుని  కంటే  చల్లనైనది 

సూర్యుని  కంటే  వెచ్చనైనది

జాబిలి  కంటే  ప్రకాశవంతమైనది

కిరణాల  కంటే  కాంతివంతమైనది

తేనె  కంటే  తీయనైనది 

వెన్న  కంటే  సుతి  మెత్తనిది

 కోయిల పాట కంటే స్పష్టమైనది

కొబ్బరి నీళ్ళ కంటే స్వచ్ఛమైది

ఇలాగే  కలిసి మెలసి కలకాలం ఉండాలి.....!!