ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆత్మ జ్ఞానము--సుజాత.పి.వి.ఎల్.--శరీరం రథం లాంటిది. ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథాన్ని నడిపే సారధి. మనసు కళ్లెము, ఇంద్రియములు రథ చక్రాలు. ఎవరి మనసు చంచలమైనదో, ఎవరికి గ్రహింపు లేదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనములో లేవో, మనస్సు నిర్మలమైనది కాదో అలాంటి వారు అనుకున్న గమ్య స్థానాన్ని ఎప్పటికి చేరుకోలేరు. చావు, పుట్టుకలు చక్రముల మధ్యలోనే పడి నలిగిపోతుంటారు.ఎవరైతే తమ మనసును పగ్గంతో గట్టిగా లాగి పట్టుకుని అదుపులో పెట్టుకోగలుగుతారో, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోగలుగుతారో వారు అనుకున్న గమ్య స్థానాన్ని సులభంగా చేరుకోగలరు.ఆత్మకు సంబంధించిన బుద్ధి, జ్ఞానము చాలా సున్నితమైనవి, అగోచరమైనవి. సన్మార్గంలో నడుచుకునే వారు మాత్రమే వాటిని పొందగలరు.ఎవరి పట్ల భగవంతుడు సంతుష్టి చెందునో, వారికి వివేకము, వైరాగ్యము లభిస్తాయి. ఈ ప్రపంచమనే మహా సముద్రాన్ని సులువుగా,సురక్షితముగా దాటిస్తాయి. వేదములు పఠించడం వల్ల గానీ, మేధాశక్తి వల్ల గానీ, గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం వల్ల గానీ, ఆత్మ జ్ఞానాన్ని పొందలేరు. ఆత్మ ఎవరిని ఎంచుకొనునో వారే దానిని పొందగలరు. అటువంటి వారికే ఆత్మ స్వభావము బోధ పడుతుంది.
July 27, 2020 • T. VEDANTA SURY • Story