ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆదర్శం!!-కె ఎస్ అనంతాచార్య
August 25, 2020 • T. VEDANTA SURY • Poem

మైల నిండిన గుడ్డని
మేలురకం సబ్బుతో
పిండి విలువల తీగ 
మీద ఆరవేయడం!
ఎంచుకున్న లక్షణాన్ని
ఎదుటి జీవిలో ప్రవేశపెట్టి తరాలకు
అందించే శుద్ధ వంశక్రమం!
శిథిలమైన బ్రతుకుల
వెతలు దీర్చిన 
 నాలుగు రోడ్ల కూడలిలో 
నిలబెట్టిన
శి లావిగ్రహం!
రక్తపు టేరులను
చూసి హృదయం
వ్రయ్యలై ఉదయించిన
అశోకధర్మ చక్రం
నీతిని శిరోధార్యం చేసుకొని
 భీతిలేక
నిలబడే సాధనా 
ధురీ ణ త
అధ్యయనం
అధ్యాపకత్వం కాదు
అనుశీలతతో
అనుసరణీయం
నియంత్రించిన
ఆహార విహారాలు
ఉపాసించే నియమాలు
పడవలో ప్రయాణిస్తూ
హోరు గాలినేదిరిస్తూ
దరి చేర్చే నావిగేషన్
పురాణాల్లోని నాయకన్మణుల
వైలక్షిణ్యమంతా
మంతా సమాజంలోకి
ప్రవహించే పాదరసం
కార్మికుడైనా
కంపనీ ఓనరైనా
తోటి వారికి
వేగుచుక్కయై 
వెలగటమే
ఆదర్శం బోధన
కాదు
ఆచరణాత్మక సంవిధానం