ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆనందం: -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 5, 2020 • T. VEDANTA SURY • Poem

వానాకాలం వచ్చిందీ
వానలు ఎన్నో తెచ్చిందీ
వానలు ఎన్నో వచ్చాయీ
భూములు అన్నీ తడిశాయీ
తడిసిన భూములు ఆనందించీ
మొలకలు ఎన్నో మొలిపించాయీ
మొలిచిన మొలకలు చక్కగపెరిగీ
పంటలు ఎన్నో పండాయీ
పండిన పంటకు ప్రాణులు అన్నీ
ఆనందంగా మురిశాయీ !!