ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆన్ లైన్ విద్య - సరోజ పోచమల్లు
September 3, 2020 • T. VEDANTA SURY • News

కరోన జన జీవనాన్ని స్తంభింపచేయడమే కాకుండా దాని ప్రభావం విద్య పైన కూడా పడవట్టె.
కరోనా తో బడులు అన్ని మూసివేసి పిల్లలకు చదువు లేకుండా ఇంట్లో ఉండడుకావట్టే.
పిల్లల విద్యా సంవత్సరం వెనుక బడుతుందే అని తల్లి,తండ్రులలో పెరిగిన కలవరం.

దీనినే అదనుగా చేసుకొని కార్పొరేట్ యాజమాన్యం
ఆన్ లైన్ తరగతులను రంగం లోకి దించింది.

కానీ ఈ ఆన్ లైన్ తరగతుల వలన ఎవరికి లాభం?
           *************************

వున్నాడు వాళ్ళ పిల్లలకు ఓ..మొబైల్ కొని  ఆన్ తరగతులను వినిపించగలడు.
ఇక ఈ ఆన్ లైన్ చదువు కూడా ఉన్నోనికే విద్య,లేని వాడికి అందని ద్రాక్ష.

లేని వాడు వాళ్ళు బ్రతకడమే కష్టం ఇక వేలకువేలు  పోసి మొబైల్ ఎలా కొనగలడు.
ఇకవేల అప్పోసప్పో చేసి కొన్న దానికి బ్యాలెన్స్  వేయడం.అది సామాన్యుడికి మోయలేని బారమే గా..
ఇంత చేసి పిల్లల కోసం అన్ని అమ్మి ఆన్ లైన్ తరగతులు ఏర్పాటు చేయిస్తే.ఆ పిల్లలు క్లాస్ అని చెప్పి మొబైల్ ను చెడు కోసం ఉపయోగిస్తే?
చదువురాని తల్లి ,తండ్రులు వాళ్ల పిల్లలు మొబైల్ లో ఎమ్ చూస్తున్నారో వాళ్లకు ఎమ్ తెలుస్తుంది..
పిల్లలు పేడదారి పెట్టె ప్రమాదం లేదా..ఆన్ లైన్ తరగతుల వల్ల?

తోటి పిల్లల తోని కలిసి,ఆడుకుంటూ,పాడుకుంటూ సాగే విద్యాబ్యాసం నాలుగు గోడల మధ్య నలిగి పోవట్టె. పొద్దున లేచింది మొదలు పిల్లలకు రెస్ట్ లేకుండా చేతిలో మొబైల్ తో చెవిలో హేర్ ఫోన్స్ తో బయటి ప్రపంచం తో సంభందం లేకుండా.తను, మొబైల్ అంతే అన్నట్టు ఒక జైలు లాంటి విద్య  వాడి భవిషత్ మీద ఎంత ప్రభావం చూపుతుంది.

ఇప్పటికే జనాలు మొబైల్ కి బానిస అయ్యి తనకుటుంబాన్ని, కనీసం తన పక్కన ఉన్నవాళ్లను కూడా పట్టించు కోకుండా.తను ఒంటరిగా గడుపవట్టె.
ఇక పిల్లలు కూడా మొబైల్ కు బానిస అయితే..వాడికి మంచి,చెడు విచక్షణ బంధాల,బంధుత్వాల విలువ తెలియకుండా పెరగడా..??
ఒక ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే ఎలా అయిన బాధపడి కొని ఇస్తారు.కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్లు ఏం చేయాలి ఎన్ని ఫోన్లు ,ల్యాప్ టాప్ లు కొనాలి. నిరు పేద సగటు మనిషికి ఇది ఎంత మోయలేని భారం.
ఇంత చేసిన రేడియేషన్  పిల్లల మానసిక,శారీరక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపదా.