ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆరోగ్యమంటే----సుజాత.పి.వి.ఎల్.
September 22, 2020 • T. VEDANTA SURY • News

ఆరోగ్యం అంటే ఏమిటి!? అని అడిగితే
ఏ రోగమూ లేకపోవటం.. అంటుంది మన వైద్యశాస్త్రం. 
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు.
సంస్కృత పదమైవ “స్వస్థ్యం”...అనగా 
తనలోతాను ఒదిగి వున్నవాడు..స్వస్థుడు అనగా తననితాను చేరినవాడు. లోకంలోని మరే భాషా..ఈ పదం చెప్పే అర్ధాన్ని ఇవ్వవు స్వస్థత..మన సహజసిద్ధ మూలం. 
అస్వస్థత...మన జీవన వైఖరి. 
అస్వస్థతని..వైద్యం మనిషి ఉపరితలం వద్ద పట్టుకుంటుంది. ధ్యానం ఆ మనిషి 
అంతరంగపు లోతుల్ని పట్టుకుంటుంది.
వైద్యశాస్త్రం కనపడే శరీర సంభవాలకి చికిత్స 
చేస్తుంది. ధ్యానయోగం కనపడక మనలోనే  
వున్న ఆరోగ్యం పట్టుకోవటం సాధ్యం చేస్తుంది.